- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టణ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి..
ఇల్లెందు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర సోమవారం తెల్లవారుజామున మున్సిపల్ ఉద్యోగుల విధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు.

దిశ, ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర సోమవారం తెల్లవారుజామున మున్సిపల్ ఉద్యోగుల విధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆమె, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పట్టణ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా అంకితభావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చైర్‌పర్సన్ పేర్కొంటూ, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.






