- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డెంగ్యూ’ మహమ్మారికి ఎట్టకేలకు చెక్.. తొలి వ్యాక్సిన్‌కు DCGI అనుమతి
భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: చాపకింద నీరులా వ్యాపిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మందిని భయపెడుతున్న డెంగ్యూ మహమ్మారికి త్వరలోనే చెక్ పడనుంది. ప్రసిద్ధ మెడిసిన్ తయారీ సంస్థ తకేడా (Takeda Biopharmaceuticals) అభివృద్ధి చేసిన క్యుడెంగా (QDENGA) వ్యాక్సిన్‌ను భారతదేశంలో వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్‌లో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌ను 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైనా వేసుకోవచ్చు. అయితే, గతంలో డెంగ్యూ వచ్చిందో లేదో అని తెలుసుకునేందుకు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మూడు నెలల వ్యవధిలో చర్మం కింద రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను 0.5 ఎంఎల్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.
4 రకాల వైరస్‌లపై ట్రయల్ సక్సెస్..
డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే నాలుగు రకాల వైరస్ రకాల (DENV 1, 2, 3, 4) పైనా ఈ టెట్రావాలెంట్ క్యుడెంగా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని గ్లోబల్, ఇండియన్ ట్రయల్స్‌లో నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 40కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్న క్యుడెంగా వ్యాక్సిన్ ఆమోదంతో దేశంలో డెంగ్యూ తీవ్రత, ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.






