హైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతులపై దేశవ్యాప్తంగా ఒకే విధానం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

by Malleboina Mahesh |

హైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతులపై ఏకరూప మార్గదర్శకాల కోసం కమిటీని వేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం.. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ!

హైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతులపై దేశవ్యాప్తంగా ఒకే విధానం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని వివిధ హైకోర్టులకు చెందిన రిటైర్డ్ జడ్జీల వసతులపై దేశవ్యాప్తంగా ఒకే విధానంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జీలకు అందించే పారితోషికాలు, భద్రత, వైద్యం, ఇతర వసతులలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఏకరూపత (Uniform Guidelines) ఉండేలా మార్గదర్శకాలను రూపొందించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య మారడానికి ఎలాంటి కారణం లేదని, వృద్ధులను, సీనియర్ సిటిజన్లను గౌరవంగా చూసుకోవడం మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం రెండు వారాల వ్యవధిలోగా ఈ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఏర్పాటైన మూడు నెలల్లోగా తన సిఫార్సుల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మరియు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సౌకర్యాలకు అయ్యే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలనే మెకానిజంపై కూడా కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు సూచనపై సానుకూలంగా స్పందిస్తూ.. ఈ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.

Next Story