రాజంపేట వరకు ప్రత్యేక బస్సు నడపండి: యూఎస్ఎఫ్ఐ

by Jakkula.Mamatha |

రాజంపేట మండల కేంద్రం వరకు గుండారం రూట్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు నడిపించాలని కామారెడ్డి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్‌కు సోమవారం యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలిపారు.

రాజంపేట వరకు ప్రత్యేక బస్సు నడపండి: యూఎస్ఎఫ్ఐ
X

దిశ, కామారెడ్డి రూరల్: రాజంపేట మండల కేంద్రం వరకు గుండారం రూట్ లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు నడిపించాలని కామారెడ్డి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్‌కు సోమవారం యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలిపారు. రాజంపేట, లింగాయపల్లి కొట్టాలపల్లి గ్రామాల విద్యార్థిని విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కాలేజ్ స్పెషల్ బస్సు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు స్పెషల్ బస్సు మా డిమాండ్ సమయానికి బస్సు ఉంటేనే సమయానికి విద్య అందుతుంది. బస్సు సౌకర్యం కల్పించండి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి. విద్యకు అడ్డుగా రవాణా సౌకర్యం ఉండకూడదని అన్నారు. రాజంపేట, లింగాయపల్లి, కొట్టాలపల్లి గ్రామాల నుంచి ప్రతి రోజూ సుమారు 50 నుంచి 70 మంది విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారని తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 8:35 గంటలకు కళాశాల ప్రారంభమవుతుందని, అయితే రాజంపేట–లింగాయపల్లి బస్ స్టాప్ వద్ద విద్యార్థులు సమయానికి బస్సులు లేక బస్సుల కోసం వేచి చూసినా బస్సులు సకాలంలో రాకపోవడంతో కళాశాలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ముఖ్యమైన తరగతులు మిస్ అవుతూ విద్యార్థుల చదువు పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల కామారెడ్డి డిపో ఆర్టీసీ మేనేజర్ రాజంపేట లింగయ్య పల్లి విద్యార్థుల ఈ సమస్యను అత్యవసరంగా పరిగణనలోకి తీసుకుని రాజంపేట – లింగాయపల్లి గ్రామాల విద్యార్థుల కోసం ఉదయం కళాశాల సమయానికి ప్రత్యేక బస్సు నడపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగళ్ళ సతీష్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story