ఆ చేదు అనుభవం తర్వాత నా కుక్కనే నమ్ముకున్నా.. ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

తన పెంపుడు కుక్క అకౌంట్ ద్వారానే తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటానని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించింది.

ఆ చేదు అనుభవం తర్వాత నా కుక్కనే నమ్ముకున్నా.. ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈమె నేరుగా తెలుగు సినిమాలో నటించకపోయినా, టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సంబరాల ఏటిగట్టు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇటీవల 'ఘట్టా కుస్తీ 2' చిత్రంతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నాకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. అలాగే కామెడీ ప్రధానమైన పాత్రల్లో కూడా నటించాలని ఉంది.

అయితే కామెడీని మరింత బాగా పండించే విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని నేను భావిస్తున్నానని తెలిపింది. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది. సోషల్ మీడియా నాకు ఎప్పుడూ పూర్తిగా సురక్షితంగా అనిపించలేదు. ఒకసారి నా ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. అందుకే సోషల్ మీడియాలో పెద్దగా ఆసక్తి చూపించను. అయితే నా పెంపుడు కుక్క పేరుతో మాత్రం ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంది. నా సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో అదే అకౌంట్ ద్వారా పంచుకుంటుంటానని ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.

Next Story