పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

by Ratna Kumari |

ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం వేంసూరు ఎస్సై కవిత ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
X

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం వేంసూరు ఎస్సై కవిత ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.2,000 నగదుతో పాటు 10 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై కవిత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ వ్యవహారంలో పోలీసు శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్ పేరు కూడా వినిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, ఈ అంశాలపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. పరారైన వారిని కూడా కేసులో చేర్చి చర్యలు తీసుకుంటారా, లేక ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిపైనే కేసును పరిమితం చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story