- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైట్ అవుట్‌ఫిట్‌లో చూపు తిప్పుకోనివ్వని అందాలతో కట్టిపడేస్తున్న కాజల్ అగర్వాల్
వైట్ డ్రెస్‌లో మెరిసిపోయిన కాజల్ అగర్వాల్.

దిశ, వెబ్ డెస్క్: తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో గ్లామర్ పాత్రల కంటే వైవిధ్యమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
సినిమాల ఎంపికలోనే కాదు, సోషల్ మీడియాలోనూ గతంతో పోలిస్తే ఎంతో డీసెంట్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
వాటిలో వైట్ కలర్ డ్రెస్‌లో ఎంతో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపించింది. కూర్చొని, నిలబడి వివిధ స్టైలిష్ పోజులతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. నుదిటిపై పెట్టుకున్న చిన్న బొట్టు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది.
టీ-షర్ట్ స్టైల్ డ్రెస్‌లో ఇచ్చిన పోజులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ తాజాగా 'ది ఇండియా స్టోరీ' చిత్రంలో నటించింది. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న NBK111 చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తోంది.
Photos Courtesy: Instagram






