ఆ ఐపీఎల్ ఆట‌గాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశాలు

by velandi.Saikiran |   (  Updated:2026-07-20 21:00:12  IST  )

అభిషేక్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఐపీఎల్ ఆట‌గాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పోరెల్ కు ఊహించని షాక్ తగిలింది. ఓ యువతి రేప్ కేసులో అభిషేక్ పోరెల్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కలకత్తా హైకోర్టు. బాధితురాలి ప్రైవసీని కాపాడేందుకు పోరెల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లను కూడా సీజ్ చేయాలని కీలక సూచనలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... లైంగికంగా లొంగదీసుకున్నాడని ఇటీవల కాలంలోనే అభిషేక్ పోరెల్ పైన బాధిత యువతి కేసు పెట్టింది. కర్ణాటకలోని మాగ్రా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు పెట్టారు. అయితే ఈ కేసు పై న్యూస్ రాగానే వెంటనే స్పందించిన అభిషేక్, తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ యువతి చేసిన ఆరోపణలను ఖండించాడు. అయితే ఇదే కేసులో అభిషేక్ పోరెల్ ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

Next Story