- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 3తో ముగియనున్న ‘సర్’ గడువు
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్)ను వేగవంతం చేసేందుకు రెవెన్యూ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న హెల్ప్ డెస్క్‌లకు మంచి స్పందన లభిస్తుంది.

దిశ, మంగపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్)ను వేగవంతం చేసేందుకు రెవెన్యూ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న హెల్ప్ డెస్క్‌లకు మంచి స్పందన లభిస్తుంది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అధికారుల ఆధ్వర్యంలో బీఎల్ఏలు రాజకీయ పార్టీ ఆధ్వర్యంలోని బీఎల్ఓలతో పాటు శిక్షణ పొందిన యువతతో మండలంలోని 25 పంచాయతీలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి సర్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆగస్టు 3తో సర్ ప్రక్రియ గడువు ముగుస్తుండటంతో జూలై 20 నుంచి చాలా చోట్ల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసిన రాజకీయ నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లతో ఓటర్ల ఇంటి ఇంటికి తిరుగుతూ దరఖాస్తులు పూరించడంతో ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
మందగించిన ఎన్యూమరేషన్..
ఎన్యూమరేషన్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోయే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన యువతీ యువకులతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి వార్డుల వారీగా గ్రూపులను విభజించి సొంత లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ లతో పాటు 2002 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకోని దరఖాస్తులను పూరిస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు సైతం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లకు వార్డుల వారీగా మంచి స్పందన లభిస్తోంది.
నిమిషాల్లో నింపుతున్న దరఖాస్తు..
వృద్ధులు, నిరక్షరాస్యులు, మారుమూల గ్రామాల ప్రజలు ధరఖాస్తులు నింపడంతో కష్టంగా భావిస్తున్న తరుణంలో హెల్ప్ డెస్క్ లకు ఆదరణ పెరిగింది. రెండు నిమిషాల్లోనే ‘సర్’ ప్రక్రియను పూర్తి చేస్తుండడంలో శిక్షణ పొందిన సిబ్బంది, యువత 2002 ఓటరు జాబితా ఆధారంగా అవసరమైన వివరాలను గుర్తించి ఫారం నింపుతున్నారు. దీంతో ఓటర్లలో ఉన్న అయోమయం తొలగి ఓటరు గణన ప్రక్రియ వేగం అందుకుంది.






