నయనతార స్మోకింగ్... 'టాక్సిక్' మూవీపై మ‌రో వివాదం!

by velandi.Saikiran |

'టాక్సిక్' మూవీ నయనతార స్మోకింగ్ చేసిన సీన్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

నయనతార స్మోకింగ్... టాక్సిక్ మూవీపై మ‌రో వివాదం!
X

దిశ‌, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యష్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా 'టాక్సిక్'. KGF 2 బంపర్ హిట్ అయిన నేపథ్యంలో యష్ చేస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కథ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా రేంజ్ లోనే గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ నయనతార స్మోకింగ్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ 'టాక్సిక్' సినిమా నుంచి ఇవాళ మనసాగదే (Manasaagadhe) సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో నయనతార స్మోకింగ్ చేస్తూ కనిపించారు.

పాత్రలను చాలా జాగ్రత్తగా ఎంచుకునే నయనతార, ఈ సినిమాలో సడన్ గా సిగరెట్ పట్టుకొని కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి నయనతార రూట్ మార్చారా ? లేదా క‌థ‌ డిమాండ్ చేసిందా ? అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నయనతార... తన కెరీర్ ప్రారంభంలో బోల్డ్ గా కనిపించారు. ఆ తర్వాత చీరకట్టులో మెరిశారు. ఇక ఈ టాక్సిక్ సినిమాలో మాత్రం ఊర మాస్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ స్మోకింగ్ సీన్ అంటున్నారు. కాగా య‌ష్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా, హుమా ఖురేషి మెరువనున్నారు.



Next Story