రాజ్యాంగ పరిరక్షణే భీమ్ ఆర్మీ లక్ష్యం.. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు

by Kodari Anjali |

రాజ్యాంగ పరిరక్షణే భీమ్ ఆర్మీ లక్ష్యమని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణే భీమ్ ఆర్మీ లక్ష్యం.. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజ్యాంగ పరిరక్షణే భీమ్ ఆర్మీ లక్ష్యమని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం భీమ్ ఆర్మీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జెండాను ఆవిష్కరించి మహనీయులకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భీమ్ ఆర్మీ సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజన హక్కుల సాధన, విద్యార్థులు, యువత అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజ్యాంగ విలువలు, సామాజిక బాధ్యతలు, మానవ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యువత రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక మార్పు కోసం కృషి చేయాలని, అన్యాయం, వివక్షకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరీష్, కిరణ్, మహేష్, వేణు, రాకేష్, నరేష్, సృజన, కావ్యతో పాటు భీమ్ ఆర్మీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story