అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం

by Ratna Kumari |

దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), పార్టీ కార్యకర్తల ప్రధాన బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), పార్టీ కార్యకర్తల ప్రధాన బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే, అర్హులైన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. 18 ఏళ్లు పూర్తయిన యువతకు కొత్త ఓటరు నమోదుతో పాటు అవసరమైన చోట మార్పులు, చేర్పులు, సవరణలు జరిగేలా ప్రజలకు సహకరించాలని కోరారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు)తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు, గిరిజనులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సహాయం అందించాలని సూచించారు.

Next Story