- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ పోర్ట్‌లో ప్రమాదం: హీరో నందమూరి బాలకృష్ణకు గాయాలు
స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతున్న తాజా చిత్రం (NBK111) షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాకినాడ పోర్ట్ పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ అనుకోకుండా కాలుజారి కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆందోళన అవసరం లేదన్న వైద్యులు..
ఆసుపత్రిలో వైద్యులు బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయం స్వల్పమైనదేనని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది. శరవేగంగా జరుపుకుంటున్న ఈ కాకినాడ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. బాలకృష్ణకు గాయమైందనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.






