- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: రూ. 30,000 వరకు ధరలు పెంచేసిన మారుతీ సుజుకి
సాధారణంగా మారుతీ సుజుకి ఏడాది ప్రారంభంలో ధరలు పెంచుతుంది. కానీ, ఈసారి చాలా కాలంపాటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన తర్వాత, మే 21న మొదటిసారి ధరలు పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ముడి సరుకులు, తయారీ ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మరోసారి ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల మోడళ్ల ధరలను గరిష్టంగా రూ. 30,000 వరకు పెంచనున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే అన్ని మోడళ్లపై ఒకే పెంపు ఉండదని, మోడల్‌ను బట్టి ధరల సవరణ మారుతుందని స్పష్టం చేసింది. సాధారణంగా మారుతీ సుజుకి ఏడాది ప్రారంభంలో ధరలు పెంచుతుంది. కానీ, ఈసారి చాలా కాలంపాటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన తర్వాత, మే 21న మొదటిసారి ధరలు పెంచింది. ఇప్పుడు 2 నెలల వ్యవధిలోనే మరోసారి ధరలు పెంచడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఖర్చులను తగ్గించే చర్యలతో పెరిగిన వ్యయభారాన్ని కంపెనీ భరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గకపోవడంతో కొంత భాగాన్ని వినియోగదారులపైకి మళ్లించక తప్పడం లేదని తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో ధరల పెంపు ధోరణి కొనసాగుతున్న సమయంలో మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టాటా మోటార్స్ 1.5 శాతం , హ్యుండాయ్ మోటార్ ఇండియా రూ. 12,800, కియా ఇండియా 2 శాతం వరకు ధరలను సవరించాయి. ఈ కంపెనీలు కూడా ముడి సరుకుల ధరల పెరుగుదల, ఇన్‌పుట్ ఖర్చుల భారం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లనే కారణాలుగా పేర్కొన్నాయి.






