- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుచీర్ వాసవిల.."నాలా" కన్వర్షన్ మాయాజాలం..!
‘సుచిర్ ఇండియా- వాసవి నిర్మాణ్’ సంస్థలు చేపట్టిన సుమారు 80 ఎకరాల మెగా వెంచర్‌లో ఈ కోణంలో చూసిన అక్రమాలు, ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో: ‘సుచిర్ ఇండియా- వాసవి నిర్మాణ్’ సంస్థలు చేపట్టిన సుమారు 80 ఎకరాల మెగా వెంచర్‌లో ఈ కోణంలో చూసిన అక్రమాలు, ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. వెంచర్ ఆది నుంచి అటు ప్రభుత్వాన్ని ఇటు కొనుగోలుదారులను మోసం చేసే విధంగానే సుచీర్ ఇండియా వాసవి నిర్మాణ సంస్థల తీరు ఉన్నదని విమర్శలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. చెరువులను వాటి నాలాలను ఆక్రమించి వెంచర్ వేయడం అమాయకులకు ప్లాట్లను అంటగట్టడం విషయం తెలిసిందే. ఇప్పుడు వ్యవసాయ భూములను వ్యవసాయత్ర భూములుగా మార్చుకొని వెంచర్ వేయాల్సిన ఉండగా ఆ విధంగా చేయకుండానే లేఔట్ వేసినట్లుగా తెలుస్తుంది. సుచిర్ ఇండియా వాసవి నిర్మాణ సంస్థలు 'నాలా' కన్వర్షన్ అక్రమాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ విస్తీర్ణానికి మాత్రమే కన్వర్షన్ అనుమతులు పొంది, మిగిలిన భూమిని అక్రమంగా రియల్ దందాకు వాడుకుంటున్నట్లు అధికారిక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి చెబుతున్నారు.
విస్తీర్ణం ఒకటి.. అనుమతి మరొకటి!
మొత్తం వెంచర్ విస్తీర్ణం దాదాపు 80 ఎకరాలకు పైగా ఉన్నప్పటికీ, సుచిర్ ఇండియా సంస్థ పోతైపల్లి గ్రామంలో కేవలం 18-12 గంటల విస్తీర్ణానికి మాత్రమే కన్వర్షన్ అనుమతులు పొందింది. ఇందుకోసం చలాన్ నంబర్ 62732 (తేదీ: 09.09.2016) ద్వారా రూ. 8,24,625/ ఫీజు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది అని విమర్శిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తే, వెంచర్ మొత్తం లేఅవుట్ అనుమతులు లేని భూమిలో కూడా ప్లాట్లు వేసి, ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని హరిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాసిల్దార్ కార్యాలయం జారీ చేసిన సమాచారం ప్రకారం, సర్వే నంబర్ 360లో కేవలం కొంత భాగం మాత్రమే వ్యవసాయేతర భూమిగా నమోదు చేయబడినా, డెవలపర్లు పూర్తి భూమిని లేఅవుట్‌లో కలిపేసి విక్రయించడం గమనార్హం.
అధికారుల ఆదేశాలు బేఖాతరు..
అక్రమాలపై అధికారులు జారీ చేసిన హెచ్చరికలను, ఆదేశాలను డెవలపర్లు ఏమాత్రం లెక్కచేయడం లేదు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని హెచ్ఎండిఏ లేఖ నం. 4126/MED/PLG/HMDA/2024 (తేదీ: 18-04-2026)* ద్వారా సబ్-రిజిస్ట్రార్, షామీర్‌పేట వారికి లేఖ రాస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు వెంచర్‌లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేసింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ లేఖ నం. SE/IC/HYD/DSE/DEE-I/TS-2/NOC/F-37/Vasavi Nirman/2388 (తేదీ: 24-11-2025) ద్వారా నిబంధనలు ఉల్లంఘించినందున ఇచ్చిన NOCని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక లేఖ నం. *4126/MED/PLG/HMDA/2024 (తేదీ: మార్చి 2026) ద్వారా, లేఅవుట్ అక్రమాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని హెచ్ఎండిఏ హెచ్చరించింది. కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లేఖ నం. G1/TPS/KSR/GHMC/15/2025 (తేదీ: 20-01-2026) ప్రకారం, నాళాలు ఆక్రమణకు గురయ్యాయని, బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగాయని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అయినా ప్రస్తుత లేఔట్ లో నిర్మాణాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఖజానాకు భారీ నష్టం..
ప్రభుత్వానికి చెల్లించాల్సిన కన్వర్షన్ ఫీజు చెల్లించకపోవడం వల్ల, భవిష్యత్తులో ఆ ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్ల పరంగా, బ్యాంక్ లోన్ల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అక్రమ కన్వర్షన్లపై విచారణ జరపాలని, ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






