- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటక పురస్కారం: 'బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్'గా ఏపీ
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఏపీ టూరిజం విభాగానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ (మ్యారేజ్ డెస్టినేషన్‌గా శరవేగంగా ఎదుగుతున్న రాష్ట్రం) అవార్డు వరించింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన 'ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్‌క్లేవ్' (IWTC) వేదికగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ అవార్డును మంగళవారం అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. పర్యాటక రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఒక ప్రత్యేక కేరాఫ్ అడ్రస్‌గా, అంతర్జాతీయ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఉన్న అందమైన సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలను వెడ్డింగ్ డెస్టినేషన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.






