- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ దగ్గర హైటెన్షన్.. మరోసారి పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం!
జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. అక్కడికి భారీగా యువత చేరుకుంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేందర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆదోళన మంగళవారం సైతం కొనసాగుతోంది. నిన్న సీజేపీ ఇచ్చిన చలో పార్లమంట్ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసినా ఆందోళన కారులు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ మరోసారి పార్లమెంట్ ముట్టడికీ సేజీపీ ప్రయత్నించింది. పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జిలో గాయపడిన యువతను ఇవాళ సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్దకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే పరామర్శించారు. నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని పట్టించుకోని యువత ఇవాళ మరోసారి జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ సీజేపీ ఆందోళనల పట్ల అప్రమత్తంగా ఉన్న పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీగా మోహరించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసేవరకు నిరసన ఆగదని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది.
కొనసాగుతున్న వాంగ్ చుక్ నిరాహార దీక్ష:
నిన్న ఆందోళనకారులపై పోలీసులు దాడి చర్య తర్వాత సోనమ్ వాంగ్ చుక్ తన ఉపవాస విరమణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తెలిపారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన దీప్కే.. సోనమ్ వాంగ్‍చుక్ ఆరోగ్యం చాలా క్షీణించిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే అవయవాలు దెప్పతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దాంతో దీక్ష విరమించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిచామని ఈ క్రమంలో మూడు షరతులను నెరవేరిస్తే దీక్ష విరమించేందుకు సోనమ్ వాంగ్ చుక్ సిద్ధమయ్యారు. కానీ నిన్న యువతపై పోలీసుల కృూరమైన దాడి చూశాక సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ఆపాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకుని దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కోచింగ్ సెంటర్లపై ఆగ్రహం:
ఇదిలా ఉంటే విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపని కోచింగ్ సెంటర్లు, టీచర్లను బహిష్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాలో కోరింది. విద్యార్థులకు మద్దతుగా నిలవని ప్రతి ఉపాధ్యాయుడిని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. అనేక మంది నీట్ విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో చేరారు. దీంతో కోచింగ్ సెంటర్లకు కేవలం ఈ దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడమే కావాలా? వారి భవిష్యత్ అక్కర్లేదా? విద్యార్థుల పోరాటం మీపోరాటం కాదా అని ప్రశ్నించింది.






