- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటిపై పరువునష్టం వేస్తా: ఎమ్మెల్యే గల్లా మాధవి
గుంటూరులో మహిళ వివస్త్ర ఘటన సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. మహిళను వివస్త్రను చేసిన ఘటనలో తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో మహిళ వివస్త్ర ఘటన(Woman Naked Incident) సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. మహిళను వివస్త్రను చేసిన ఘటనలో తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి(Mla Galla Madhavi) అని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Amabati Rambabu) ఆరోపించారు. పేదరాశి పెద్దనాన్న అంబటి అని ఎద్దేవా చేశారు. మహిళ వివస్త్ర ఘటనలో చిలక జోస్యం చెప్పారని విమర్శించారు. ఈ కథనాలు ఇలా జరిగాయని అంబటి రాంబాబు ఓ సాక్షి మాదిరిగా చెప్పారని మండిపడ్డారు. తనపై, పోలీసులపై తమరు కల్పించిన కట్టుకథకు విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేయడం నవ్వాలో, ఏడవాలో అర్ధం కావట్లేదన్నారు. ఇన్నాళ్లు అంబటి రాంబాబు రాజకీయాల్లో ఎలా ఉన్నారో తెలియక బాధపడాలో అర్థంకాని పరిస్థితి ఉందని ఆమె ఎద్దేవా చేశారు.
నిరూపించాలి.. లేదంటే...!
మహిళల పట్ల వైసీపీలో ఎలాంటి విధానం ఉందో చెప్పాలన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని, లేనిపక్షంలో పరువు నష్టం వేస్తానని హెచ్చరించారు. నిందితులను కాపాడినట్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఘటనను వక్రీకరిస్తున్నారని గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు వెంటనే క్షమపణలు చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు.






