- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ట్వీట్‌తో అదిరిపోయే ట్విస్ట్!
తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అంతా తన ఆరోగ్యం గురించి తెగ ఆందోళన చెందుతుంటే, సల్మాన్ మాత్రం చాలా కూల్‌గా స్పందించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో ఆయన చాలా అలసిపోయినట్లు, దగ్గుతూ కాస్త బలహీనంగా కనిపించారు. ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా ఉండే సల్లూ భాయ్ ఇలా కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఆయన ఏదో తీవ్రమైన వ్యాధి కారణంగానే అనారోగ్యానికి గురయ్యారని, అందుకే గుర్తుపట్టలేనంతగా మారిపోయారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అంతా తన ఆరోగ్యం గురించి తెగ ఆందోళన చెందుతుంటే, సల్మాన్ మాత్రం చాలా కూల్‌గా స్పందించారు.
"మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?" అని రివర్స్‌లో ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా, బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్‌లో తను ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేసి, తనకు ఏమీ కాలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘రాజా శివాజీ’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన ఆయన, ప్రస్తుతం ‘మాతృభూమి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రాబోతున్న ఈ హై-వోల్టేజ్ వార్ డ్రామాలో సల్మాన్ సరసన చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హిమేష్ రేషమ్మియా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది






