- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిపల్లి, పీర్జాదిగూడ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్..!
మేడ్చల్ జిల్లా మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేవారు.

దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ గత కొన్ని వారాలుగా నాయకులు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం జిల్లా పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి చేరడంతో, విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని వారు హితవు పలికినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ ఆదేశాల మేరకు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి జలేందర్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ పాల్గొన్నారు. సమావేశంలో తుంగతుర్తి రవి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొనాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఓబీసీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగం నాయకులు, యువకులు, కమిటీ సభ్యులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






