ఫోన్ మాట్లాడుతూ బస్ డ్రైవింగ్.. ప్రయాణికుల తీవ్ర ఆందోళన

by Jakkula.Mamatha |

టీఎస్‌ఆర్‌టీసీ ప్రయాణాల పై ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ.. ప్రమాదాలకు గురి కాకుండా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది.

ఫోన్ మాట్లాడుతూ బస్ డ్రైవింగ్.. ప్రయాణికుల తీవ్ర ఆందోళన
X

దిశ, కోస్గి: టీఎస్‌ఆర్‌టీసీ ప్రయాణాల పై ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ.. ప్రమాదాలకు గురి కాకుండా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది. తమ బాధ్యతను విస్మరిస్తూ.. నిర్లక్ష్యంగా ఆదివారం ఉదయం 9:15 గంటలకు మహబూబ్నగర్ డిపోకు చెందిన టీఎస్ 34, టి 2631 నెంబర్ గల టిఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ కోస్గి నుంచి మహబూబ్నగర్‌కు వెళ్లే క్రమంలో ఫోన్ మాట్లాడుతూ దాదాపు 2 కి.మీ మేర నేషనల్ హైవే 167 పై బస్ నడపడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. ఇలాంటి డ్రైవర్ల పై సంబంధిత ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం నెలకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించే కంటే జరగకముందే జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story