- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య బర్త్‌డే స్పెషల్‌గా 'వీడొక్కడే' రీ-రిలీజ్.. అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
'వీడొక్కడే' చిత్రాన్ని జూలై 22న మరోసారి తెలుగులో రీ-రిలీజ్ చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సూర్య, తమన్నా జంటగా కొన్ని సంవత్సరాల క్రితం తెరకెక్కిన 'అయాన్' చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో 'వీడొక్కడే' పేరుతో విడుదల చేయగా, ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే రీ-రిలీజ్ బుకింగ్స్ ప్రారంభించగా, జూలై 22న ఈ సినిమాను థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. గతంలో సూర్య నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం పలుమార్లు రీ-రిలీజ్ అయి అద్భుతమైన వసూళ్లు సాధించిన నేపథ్యంలో, 'వీడొక్కడే' కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందా అనే ఆసక్తి నెలకొంది. కె.వి. ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభు, ఆకాశ్ దీప్ సైగల్ కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎమ్.ఎస్. గుహన్, ఎమ్. శరవణన్ నిర్మించారు.






