మనుబోతులగూడెం ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-19 16:14:30  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.

మనుబోతులగూడెం ఘటనపై మంత్రి సీతక్క సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణ పేరుతో అతిగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో.. అటవీ ఆధారిత ఆదివాసీ గిరిజన కుటుంబాల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని సీతక్క స్పష్టం చేశారు. అర్హులైన స్థానికులకు చట్టబద్ధంగా హక్కులు కల్పిస్తోందన్నారు. కొత్తగా పోడు భూముల ఆక్రమణలను ప్రభుత్వం ప్రోత్సహించబోదని సీతక్క స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు అటవీ సంపద సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు.

Next Story