- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ క్రేజ్ ఏంట్రా బాబూ’.. హీరోయిన్‌ను పక్కనపెట్టి మేనేజర్ వెంట పడ్డ మీడియా
by Gantepaka Srikanth |
సినిమా రంగంలో సెలబ్రిటీల వెంటే కెమెరాలు తిరగడం సహజం. కానీ, అనూహ్యంగా ఓ ఈవెంట్‌లో కథానాయికను పక్కనపెట్టి ఆమె మేనేజర్ పైనే అందరి దృష్టి పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సినిమా రంగంలో సెలబ్రిటీల వెంటే కెమెరాలు తిరగడం సహజం. కానీ, అనూహ్యంగా ఓ ఈవెంట్‌లో కథానాయికను పక్కనపెట్టి ఆమె మేనేజర్ పైనే అందరి దృష్టి పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 2017లో ప్రముఖ నిర్మాణ సంస్థ 'యష్ రాజ్ ఫిల్మ్స్' నిర్మించిన 'కైదీ బ్యాండ్' (Qaidi Band) సినిమాతో నటి అన్యా సింగ్ (Anya Singh) బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. తాజాగా ఆమె హాజరైన ఒక కార్యక్రమంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అన్యా సింగ్ ఈవెంట్‌కు వచ్చిన సమయంలో అక్కడున్న మీడియా ఆమెను అంతగా పట్టించుకోకుండా, ఆమెతో పాటు వచ్చిన మేనేజర్‌పైనే పూర్తి దృష్టి పెట్టారు. కెమెరాలన్నీ మేనేజర్ వైపే తిరగడంతో, అనూహ్యంగా ఆ మేనేజర్ వైరల్ అయ్యారు. సాధారణంగా స్టార్స్ వెనక ఉండే మేనేజర్లు, ఇలా కథానాయిక కంటే ఎక్కువ ప్రచారం పొంది వార్తల్లో నిలవడం విశేషం.
Next Story






