- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసర భేటీ: ఏం జరగబోతోందని టెన్షన్.. టెన్షన్!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌ల భేటీ అత్యవసర భేటీ ఆసక్తిని రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) అత్యవసరంగా సమావేశమయ్యారు. రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ ఆందోళన తీవ్ర ఘర్షణకు దారితీయడం, పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షాలు నిరసనలతో సభలను స్తంభింపజేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత చేకూరింది. నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఓ వైపు సీజేపీ (Cockroach Janata Party) నేతలు, మరోవైపు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ఉభయసభల్లో విపక్షాల నిరసనలను ఎలా ఎదుర్కోనాలనే అంశాలపై అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా.. లేక విద్యా శాఖను మరెవరికైనా కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.






