సాగునీటి జలాల విడుదల పై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో

by Batti.Sumithra |

ఎస్సారెస్పీ కాల్వల్లోకి సాగు నీటి జలాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.

సాగునీటి జలాల విడుదల పై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో
X

దిశ, పెద్దవంగర : ఎస్సారెస్పీ కాల్వల్లోకి సాగు నీటి జలాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని అధ్యక్షుడు ఈదూరి ఐలయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి తొర్రూర్ నుండి వలిగొండ వెళ్లే ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ తాగునీరు అందగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే ఎస్సారెస్పీ కాలువలోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నేటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎరువుల కొరత సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, శ్రీరాం సంజయ్ కుమార్, కనుకుంట్ల వెంకన్న, శ్రీరాం సుధీర్, పాలకుర్తి యాదగిరి రావు, సుధాకర్, సర్పంచులు పటేల్ నాయక్, పరుశరాములు, వెంకన్న, నాయకులు నిమ్మల విజయం, వేణు, బిక్షపతి, అనుదీప్, రాజు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story