Bhadradri Kothagudem:రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు పాల్వంచలో శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

Bhadradri Kothagudem:రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
X

దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు పాల్వంచలో శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను కనబరిచారు. పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు చెందిన సుమారు 60 మంది సబ్ జూనియర్ క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామ్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుంచే క్రీడల్లో శిక్షణ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. భద్రాద్రి జిల్లాలో సబ్ జూనియర్ స్థాయిలో ఇంతటి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉండటం ఆనందదాయకమని పేర్కొన్నారు.

క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది జిల్లా, రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపిక పోటీల నిర్వహణలో రాకేష్, సురేష్, మునీర్, జగదీష్, సాయి చరణ్, స్నేహిత్, కీర్తన్, సాయికిరణ్, సుమంత్, హర్ష, శ్రీకాంత్ తదితరులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన ఆటగాళ్లు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించారు. ఉప్పుశెట్టి రాకేష్ ఆధ్వర్యంలో పాల్వంచ బాస్కెట్‌బాల్ క్లబ్ ఈ ఎంపిక పోటీలను నిర్వహించింది.

Next Story