సోనమ్ వాంగ్‌చుక్ భార్య కీలక నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-19 07:50:00  IST  )

ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

సోనమ్ వాంగ్‌చుక్ భార్య కీలక నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి గీతాంజలి అంగ్మో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించారు. నీట్ (యూజీ) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న వాంగ్‌చుక్‌ను పోలీసులు శనివారం సఫ్దర్‌జంగ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను ఉంచడాన్ని ఆయన భార్య తప్పుబట్టింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది వైద్యం అందించడం కాదని, చట్టవిరుద్ధమైన నిర్బంధమని తీవ్ర ఆరోపణలు చేసింది. ఆసుపత్రి ఫ్లోర్‌లో దాదాపు 30 మంది, ఆసుపత్రి ప్రాంగణంలో 100 మందికి పైగా పోలీసులు మోహరించి తమ కదలికలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కనీసం తమ న్యాయవాదులు, ఇప్పటి వరకు చికిత్స అందించిన వైద్యులను కలిసేందుకు కూడా పర్మీషన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్బంధం నుంచి తన భర్తను విడుదల చేసి, తమకు నచ్చిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేలా అనుమతిని ఇవ్వాలని గీతాంజలి అంగ్మో హైకోర్టును అభ్యర్థించారు.

Next Story