వాన దేవుడా కరుణించు.. బండ పాయసం నాకిన నేరెళ్లపల్లి గ్రామస్థులు

by Batti.Sumithra |

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక, కరువు కాటకాలతో సాగు రంగానికి గడ్డు కాలం నడుస్తోంది.

వాన దేవుడా కరుణించు.. బండ పాయసం నాకిన నేరెళ్లపల్లి గ్రామస్థులు
X

దిశ, తిమ్మాజిపేట : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక, కరువు కాటకాలతో సాగు రంగానికి గడ్డు కాలం నడుస్తోంది. కరువు రక్కసి నుంచి తమ గ్రామాలను, పంటలను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రజలు దిక్కుతోచని స్థితిలో వానదేవుడిని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ పూర్వీకుల నాటి ఆచారాలను పాటిస్తూ వినూత్న పూజలకు తెరతీస్తున్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలో శతాబ్దాల నాటి సాంప్రదాయమైన బండ పాయసం ఆచారాన్ని గ్రామస్థులు నిర్వహించారు. నూడుపులమ్మ చెరువు బండపై పాయసం పోసి, గ్రామస్థులంతా నాలుకతో నాకారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప సంజీవ్, వార్డు సభ్యులు కృష్ణ, శివ, శేఖర్, మాజీ సర్పంచ్ కాంతయ్య గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Next Story