- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో ‘జయన్న ఫౌండేషన్’ విస్తృత సేవా కార్యక్రమాలు
సిరిసపల్లిలో రూ. 7 లక్షలతో నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ‘జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: సమాజంలో పేద రికాన్ని అనుభవించి, కష్టపడి పైకొచ్చిన వారు తాము సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేసినప్పుడే ఆ సంపాదనకు సార్థకత లభిస్తుందని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి సరిత-జయపాల్ రెడ్డి అన్నారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే నినాదంతో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం మండలంలోని సిరిసపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 7 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి...
గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ సభలో జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. పదో తరగతి చదివే విద్యార్థులకు పరీక్షల సమయంలో ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు, వారి ఆటో ఛార్జీలు, ఉదయం పూట టిఫిన్ ఖర్చులను కూడా ఫౌండేషన్ భరించిందని గుర్తుచేశారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ...
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని జయపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే హుజూరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించామని, వందలాది మంది వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి వారికి చూపు ప్రసాదించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని, అలాగే మృతుల అంతిమ సంస్కారాల కోసం బాడీ ఫ్రీజర్‌ను కూడా ఫౌండేషన్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. "నేను కూడా ఒక పేద కుటుంబం నుండి వచ్చినవాడినే. అందుకే పేదరికం విలువ నాకు తెలుసు. నాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ పదవుల కోసమో నేను ఈ పనులు చేయడం లేదు. కేవలం సమాజానికి మేలు చేయాలనే స్వచ్ఛంద ఉద్దేశంతోనే జయన్న ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాను."అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి తెలిపారు.ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయన్న ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్ రెడ్డి, రాజపల్లె సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి, మున్సిపల్ కౌన్సిలర్ ఖలీల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ సువర్ణ విజయకుమార్, ఉపసర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ తక్కలపెల్లి వెంకట్రావు, ఏఎంసీ డైరెక్టర్ తునికి రవి, బీజేపీ మండల అధ్యక్షుడు పారుపల్లి కొండల్ రెడ్డిలతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






