- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లందులో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయాలి
ఇల్లందు నియోజకవర్గంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయాలని మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాదావత్ రవి ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోరారు.

దిశ, ఇల్లందు : ఇల్లందు నియోజకవర్గంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయాలని మిషన్ వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాదావత్ రవి ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోరారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని ప్రజా ఆరోగ్య సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదావత్ రవి మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, గిరిజన తండాలు ఇప్పటికీ మెరుగైన వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ప్రమాదాల కారణంగా అవయవాల పనితీరు కోల్పోయిన వారు, వికలాంగులు, వృద్ధులు సరైన ఫిజియోథెరపీ చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి బాధితులకు సమీపంలోనే ఆధునిక ఫిజియోథెరపీ కేంద్రం అందుబాటులో ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన పునరావాస వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇల్లందులో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.






