- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరిక్ష రంగంలో ఖమ్మం యువకుడి ప్రతిభ
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి భారత అంతరిక్ష రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి భారత అంతరిక్ష రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి మోర్తాల హనుమి రెడ్డి, తల్లి లక్ష్మి. సతీమణి శ్రీ వెంకట దివ్య. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో అంతరిక్ష రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ లో టీమ్ లీడ్–ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్ననరేందర్ రెడ్డి, ఇటీవల విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో కీలక బృంద సభ్యుడిగా పనిచేసి మిషన్ విజయానికి తన వంతు సహకారం అందించారు.
పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనుభవం కలిగిన ఆయనకు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్స్ విభాగాల్లో విశేష నైపుణ్యం ఉంది. భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో తన వంతు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా యువకుడు దేశ అంతరిక్ష రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ విజయాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






