అంబేద్కర్ భవనం ఎదుట మురుగునీరు తొలగించాలి..

by Kodari Anjali |

వీపనగండ్ల గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో పర్యటించి పరిశీలన నిర్వహించారు.

అంబేద్కర్ భవనం ఎదుట మురుగునీరు తొలగించాలి..
X

దిశ, వీపనగండ్ల: వీపనగండ్ల గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో పర్యటించి పరిశీలన నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మీసాల పార్వతమ్మకు 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకులు నక్క ఈశ్వర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచినా గ్రామంలోని కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని, అంబేద్కర్ భవనం ఎదుట మురుగునీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అండర్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం సీసీ రోడ్డును తవ్వి నెలలు గడిచినా పనులు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు సీహెచ్ వెంకటయ్య, నక్క ఆంజనేయులు, వెంకటేశ్వర్లు గౌడ్, మధుగని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Next Story