- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ : 24కు వాయిదా
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆయనను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కోసం, రావణ్ వెనుక ఉన్న కీలక సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలు, నిధుల వివరాలను సేకరించేందుకు ఆయన్ను 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని గన్నవరం పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగింది. రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు విజయవాడకు చెందిన న్యాయవాది గవాస్కర్, గన్నవరానికి చెందిన తిరువీధి వెంకయ్య కోర్టులో వకాలత్ దాఖలు చేశారు. అనంతరం, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సవాలు చేస్తూ రావణ్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.






