ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో విలీన ప్రక్రియ ప్రారంభం: మంత్రి పొన్నం

by Prasad Jukanti |   (  Updated:2026-07-20 10:16:38  IST  )

ఆర్టీసీ విలీనం కోరుతూ ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్కు అందజేశారు.

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో విలీన ప్రక్రియ ప్రారంభం: మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆర్టీసీలో ఒక్కొక్క సమస్యను పరిష్కారిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియ కూడా ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ కుటుంబ సభ్యులకు TGRTC ఉద్యోగుల చేయూత కార్యక్రమం ద్వారా 90 లక్షల 85 వేల 500 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఆర్టీసీ కళాభవన్‍లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌలభ్యం కార్మికుల సంక్షేమ మూడు ప్రధాన అంశాలుగా పని చేస్తున్నామని చెప్పారు. డ్రైవర్ శంకర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అర్దరాత్రి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నామని మంత్రి చెప్పారు. శంకర్ కుమారుడు కుటుంబానికి ఇల్లు మంజూరు చేశామని ఆయన కుమారుడు హేమంత్‍కు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఎంఎంటీఎస్, మెట్రోకు ఆర్టీసీ అనుసంధానం

గ్రామాల నుండి రాజధాని వరకు కొత్త రూట్‍లలో బస్సులు నడిపిస్తున్నామని, ఆర్టీసీ పేదవాడి గుండె చప్పుడు పేదవాడికి సౌకర్యం ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్న చర్యల్లో మరింత బాధ్యతగా పని చేయాలన్నారు. క్యూర్ ఏరియా పరిధిలో బస్ టెర్మినల్ నిర్మించుకుందామని మంత్రి తెలిపారు. ఎంఎంటీఎస్, మెట్రోకు ఆర్టీసీ అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో ఆర్టీసీ సంఘాలు ఎత్తివేసి నిరంకుశంగా వ్యవహరించారని కానీ ప్రజా ప్రభుత్వం రాగానే మహా లక్ష్మీ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి నెలకు ఆర్టీసీకి 300 కోట్లు విడుదల చేస్తోందన్నారు. రిటైర్డ్ కార్మికుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కార్మికుల సంక్షేమానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Next Story