- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేక కొనుగోలు వివాదం.. తండ్రి కొడుకు పై దాడి
by Batti.Sumithra |
చెంగిచెర్ల మండిలో మేక కొనుగోలు విషయంలో జరిగిన వివాదం దాడికి దారి తీసిన ఘటన పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

X
దిశ, మేడిపల్లి : చెంగిచెర్ల మండిలో మేక కొనుగోలు విషయంలో జరిగిన వివాదం దాడికి దారి తీసిన ఘటన పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నారపల్లి ఏకశిల నగర్‌కు చెందిన మలోతు సంతోష్ తన తండ్రి మున్నా, బావమరిది కిషన్‌తో కలిసి మేక కొనుగోలు కోసం వెళ్లగా, ఒక దుకాణంలో ధర ఎక్కువగా ఉండటంతో మరో దుకాణానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన మొదటి దుకాణ యజమాని అసభ్య పదజాలంతో దూషించగా ప్రశ్నించిన సంతోష్ తండ్రి మున్నా పై నీటి పైపుతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సంతోష్‌కు కుడి కన్ను సమీపంలో గాయం, ఎడమ చేయి, వీపు పై గాయాలు కాగా, అడ్డుకునేందుకు వెళ్లిన బావమరిది కిషన్‌కు కూడా గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






