చరణ్ మూవీపై క్రేజీ న్యూస్‌..అత‌న్ని కాద‌ని సుకుమార్ భారీ ప్లాన్‌!

by velandi.Saikiran |   (  Updated:2026-07-19 17:16:53  IST  )

చరణ్ - సుకుమార్ మూవీపై క్రేజీ న్యూస్ వైర‌ల్ గా మారింది.

చరణ్ మూవీపై క్రేజీ న్యూస్‌..అత‌న్ని కాద‌ని సుకుమార్ భారీ ప్లాన్‌!
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఊపులో మరో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. త్వరలోనే సుకుమార్ తో రామ్ చరణ్ కొత్త సినిమా చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రకరకాల రూమ‌ర్లు వస్తున్నాయి. స్టైలిష్ హై యాక్షన్ సీన్లతో కూడిన సుకుమార్ స్టైల్ స్క్రీన్ ప్లే సర్ ప్రైజ్ చేస్తుందని బజ్ నడుస్తోంది.

మొదటిసారిగా దేవి శ్రీ ప్రసాద్ ను కాదని బాలీవుడ్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో సుకుమార్ వర్క్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక 2028 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా కాదని.. పక్కా స్టైలిష్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని టాక్. సెప్టెంబర్ మాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాత నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుందట. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే రంగస్థలం సినిమా వచ్చి బంపర్ హిట్ అయింది.

Next Story