- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక పోరులో యూరప్ అగ్రశ్రేణి జట్టు స్పెయిన్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ ఫైనల్లో తల పడుతుండటం విశేషం.
మెస్సీపైనే అందరి చూపు..
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ పైనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు నిలిచింది. అర్జెంటీనా తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తుండగా, స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది. చరిత్రలో తొలిసారిగా 48 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు మెక్సికో అధ్యక్షుడు, కెనడా ప్రధాని వంటి ప్రపంచ నేతలు విచ్చేస్తున్నారు.
మ్యాచ్ సమయం, లైవ్ ప్రసారాల వివరాలు
మ్యాచ్ భారత కాలమానం ప్రకారం జూలై 20 (సోమవారం) తెల్లవారుజామున 12:30 గంటలకు (అర్ధరాత్రి) ప్రారంభమవుతుంది. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్.. డిజిటల్ ప్రేక్షకులకు ZEE5 యాప్/వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీవీ ఛానెళ్లు.. 'Unite8 Sports' ఛానెళ్లతో పాటు ఎంపిక చేసిన కవరేజ్‌ను 'DD Sports'లో వీక్షించవచ్చు.
మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏంటి?
నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లూ సమాన గోల్స్‌తో నిలిచి మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. విజేతను తేల్చడానికి 30 నిమిషాల అదనపు సమయం (ఎక్స్‌ట్రా టైమ్) కేటాయిస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే, ఉత్కంఠభరితమైన 'పెనాల్టీ షూటౌట్' ద్వారా విశ్వవిజేతను ప్రకటిస్తారు.






