- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: హంద్రీనీవా కాలువ(Handreinewa Canal) నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని, అనంతపురం జిల్లా(Ananthapuram District)కు నీళ్లిస్తామని ఇటీవల పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాలువ లైనింగ్ పనులను వైసీపీ నేతలు ఉరవకొండ నియోజకవర్గంలోని చోట సముద్రం సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు.
చర్చకు సిద్ధమా...
దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(Former Mla Jc Prabhakar Reddy) స్పందించారు. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. హంద్రీనీవాపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే వాస్తవాలతో చర్చకు రావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పని చేస్తున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హంద్రీనీవా కాలువకు ఏం చేశారో చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హంద్రీనీవా కాలువ పనులు జరిగాయని చెప్పారు. రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.






