ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-12-08 10:55:00  IST  )

అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. రెండేళ్ల ప్రభుత్వ పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు కలిసి ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత తరానికి ఏమి కావాలో ఈ ప్రభుత్వానికి ఆలోచించిందని తెలిపారు. తెలంగాణతో పాటు సౌత్ ఇండియా అభివృద్ధికి కర్ణాటక సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దేశ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు 40 శాతం కలిగి ఉందని, చిన్న రాష్ట్రమైనప్పటిక తెలంగాణ కూడా గొప్ప వాటా కలిగి ఉందని కొనియాడారు. కాలిఫోర్నియా వంటి నగరాల్లో 13 లక్షల భారత ఇంజినీర్లు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Read More... పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story