- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహం చట్టరీత్యా నేరం..
by Taduka Kalyani |
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంకేత్ మిత్రా అన్నారు.

X
దిశ, ఆసిఫాబాద్ : బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంకేత్ మిత్రా అన్నారు. శనివారం మండల కేంద్రమైన జైనూర్, పంగిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు బాల్య వివాహాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంరక్షణ కోసం అమలులో ఉన్న పోక్స్ ఇతర చుట్టాలతో పాటు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఫోన్లు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఉచిత న్యాయ సేవాల కోసం జిల్లా కోర్టు లేదా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని నేరుగా సంప్రదించాలని సూచించారు.
Next Story






