కోతుల దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గగ్గినేపల్లివారి గూడెంలో కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.

కోతుల దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు
X

దిశ, నిడమనూరు : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గగ్గినేపల్లివారి గూడెంలో కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గగ్గినేపల్లి మధుసూదన్ రెడ్డి (85) వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 15 కోతులు ఆయనపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఆయనకు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదను నివారించేందుకు అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story