బురద మయమైన శనివారం అంగడి

by Taduka Kalyani |

జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో శనివారం నిర్వహించిన వారాంతపు సంత (శనివారం అంగడి) తీవ్ర గందరగోళంగా మారింది.

బురద మయమైన శనివారం అంగడి
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో శనివారం నిర్వహించిన వారాంతపు సంత (శనివారం అంగడి) తీవ్ర గందరగోళంగా మారింది. మార్కెట్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మార్కెట్ ప్రాంతమంతా బురదమయంగా మారింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ దారులన్నీ జారుడు బల్లల్లా మారడంతో మహిళలు అడుగు తీసి అడుగు వేయడానికి భయపడుతూ, తీవ్ర అవస్థల మధ్యే కూరగాయల కొనుగోలు చేయాల్సి వచ్చింది. బురదలోనే తిరుగుతూ వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు.

మున్సిపల్ అధికారులు స్పందించాలి

"మార్కెట్ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే వర్షం రాగానే ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మార్కెట్ ఏరియాలో కనీస వసతులు కల్పించి, దారులను బాగు చేయాలి." అని వినియోగదారులు డిమాండ్ చేశారు.

Next Story