కన్నుల పండువగా వరుణ యాగం

by Batti.Sumithra |

రాష్ట్రం, జిల్లా, మండలం సుభిక్షంగా ఉండాలని దూప దీన నైవేద్యం జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన వరుణయాగం, గణపతి పూజ, గౌరి పూజలు కన్నులపండువగా జరిగాయి.

కన్నుల పండువగా వరుణ యాగం
X

దిశ, ఏటూరు నాగారం : రాష్ట్రం, జిల్లా, మండలం సుభిక్షంగా ఉండాలని దూప దీన నైవేద్యం జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన వరుణయాగం, గణపతి పూజ, గౌరి పూజలు కన్నులపండువగా జరిగాయి. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు ఉదయం 9 గంటలకు గణపతి పూజను స్థానిక సర్పంచ్‌ కాకులమర్రి శ్రీలత, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మినర్సింహరావు చేతుల మీదుగా దీపారాదన చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాడిపంటలు, సంవృద్ధిగా వర్షాలు కురువాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వరున్కి పూజలు చేసి వరుణ యాగంను వేదపండితులు యల్లాప్రగడ మణికంటశర్మ, యల్లాప్రగడ రుత్విక్‌ సాయిశర్మ పూజలు జరిపించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకొని వరుణయాగంలో ఏర్పాటు చేసిన జలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలను అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్‌శర్మ, రాష్ట్ర కోశాధికారి హరికిషన్‌ లు అలంకరించారు. భక్తులతో అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు. తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఐడీ కార్డు పంపిణీ..

దూప దీప నైవేద్యం కింద మంజూరైన ఆలయ అర్చకులకు రాష్ట్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్‌శర్మ, కోశాధికారి హరికిషన్‌లు ఐడీ కార్డులను రామాలయంకు అందజేశారు. రామాలయాన్ని కూడా దూప దీప నైవేద్యం స్కీంలో చేర్చాలని రాష్ట్ర అర్చకులకు ఆలయ చైర్మన్‌ అలువాల శ్రీనివాస్‌ విన్నవించారు. ఆలయం ప్రాంగణం, ఆలయ అభివృద్ది బాగుందని, ఈసారి స్కీంలో పెట్టించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ, సూర్యనారాయణశర్మ, ఏఎన్‌శర్మ, వెంకట రమణచార్యులు, కర్నె సాంబయ్య, ములుగు జిల్లా అధ్యక్షుడు మూడుంబై రఘునాథాచార్యులు, గౌరవ అధ్యక్షుడు పురుషోత్తం చార్యులు, శివ సత్యనారాయణ, వివేవాకనందస్వామి, రామాలయం కమిటీ ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, కోశాధికారి దీనబాంధవస్వామి, పోగుల లక్ష్మీనారాయణ, కిరణ్, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్, ఆత్మ కమిటీ చైర్మన్‌ చిటమట రఘు, శివాలయం చైర్మన్‌ మడుగూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story