కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో అన్ని వర్గాల ప్రజలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Kodari Anjali |

రైతులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో అన్ని వర్గాల ప్రజలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, బేగంపేట: కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ప్రభుత్వంపై రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఎన్డీరోడ్డులోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మహంకాళి-సికింద్రాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 66 హామిలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం ప్రత్యేక గుర్తింపు పొందిందని అందుకే ఓటరు జాబితా అత్యంత కీలకమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బీజేపీ శ్రేణులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..

బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, ఇతర వివరాల సవరణలను గుర్తించి సంబందిత దరకాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రతి బూత్ లో ఓటర్ల వివరాలు తప్పులు లేకుండా ఉండేలా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపితానికి ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపితం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసికునేలా అందరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, బండ కార్తీకరెడ్డి, సారంగపాణి, రమేష్, ఆనంద్, దివాకర్, వెంకటేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story