- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ...

దిశ, వెబ్ డెస్క్: పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ... 2047 నాటికి రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ మైల్ స్టోన్ గా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను సెలబ్రేట్ చేసుకుంటుందని అన్నారు. ఐటీ, ఫార్మా, ఏర్పోస్పెస్, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని చెప్పారు. ఇన్నోవేషన్ లో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందన్నారు. సమ్మిట్ ద్వారా ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు శతాబ్దాల చరిత్ర ఉందని ప్రస్తుతం మోడ్రన్ హబ్ గా ఉందన్నారు. భారతదేశపటంలో తెలంగాణ చిన్నగా కనిపించవచ్చు కానీ లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని అమలు చేయడంలో చాలా పెద్ద రాష్ట్రం అని అన్నారు.
Read More... తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబల్ సమ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు






