- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC: టీపీసీసీ పనితీరుపై మీనాక్షి నటరాజన్ సంతృప్తి!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, ప్రజా ఉద్యమాల అమలుపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, ప్రజా ఉద్యమాల అమలుపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెను కలవగా, టీపీసీసీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు-జై భీమ్ కార్యక్రమాలు, డీసీసీ కమిటీల ఏర్పాటు, మండల కమిటీల నియామకం, ఎస్‌ఐఆర్ శిక్షణ, బీఎల్‌ఏల నియామకం తదితర కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆమె అభినందించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలపై ప్రతి నెల ఏఐసీసీకి సమగ్ర కార్యాచరణ నివేదికలను పంపుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ శర్మ సేవలను కూడా ఆమె ప్రశంసించారు. టీపీసీసీ అమలు చేస్తున్న సంస్థాగత విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, దానిని అమలు చేసేందుకు 11 రాష్ట్రాల ఏఐసీసీ నేతలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
పార్టీని గ్రామ, బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి బీఎల్‌ఏపై సూపర్వైజర్‌ను నియమించాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. సమావేశంలో ఏఐసీసీ నేతలు సెంతిల్, సచిన్ సావంత్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నేత గంప వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్ సిబ్బంది సేవలను కూడా ఆమె అభినందించారు.






