బీసీ కమిషన్ భేటీలో కీలక నిర్ణయాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ బీసీ కమిషన్ సమావేశం శనివారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో ఛైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ పలు కీలక అంశాలపై చర్చించింది.

బీసీ కమిషన్ భేటీలో కీలక నిర్ణయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీసీ కమిషన్ సమావేశం శనివారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో ఛైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ పలు కీలక అంశాలపై చర్చించింది. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వివిధ శాఖల నుంచి ఉద్యోగులను నియమించుకొని కమిషన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కమిషన్ విధివిధానాలు, పద్ధతులు, కులాల గురించి పరిపూర్ణ అవగాహన ఉన్న సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కమిషన్ నిర్ణయించింది.

ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు, పీసీబీ సమర్పించిన నివేదికపై కమిషన్ చర్చించింది. అనాథలను గుర్తించడానికి వయస్సు పెంపు, సాతాని పదం తొలగింపు విషయంలో కమిషన్ ఇటీవల నిర్వహించిన విచారణపైనా చర్చించింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, బాలమాయ దేవి పాల్గొన్నారు.

Next Story