- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులను తలపిస్తున్న గుంతలు
by Taduka Kalyani |
తొగుట మండలంలోని కాన్గల్‌కు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా దెబ్బతింది. శనివారం కురిసిన స్వల్ప వర్షానికే భారీ గుంతల్లో నీరు చేరి రహదారి చెరువును తలపించింది.

X
దిశ,తొగుట: తొగుట మండలంలోని కాన్గల్‌కు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా దెబ్బతింది. శనివారం కురిసిన స్వల్ప వర్షానికే భారీ గుంతల్లో నీరు చేరి రహదారి చెరువును తలపించింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అడుగడుగునా ప్రమాదం
విద్యార్థులు,రైతులు, ఉద్యోగులతో పాటు అత్యవసర చికిత్స కోసం వెళ్లే వారు కూడా ఇదే మార్గంపై ఆధారపడుతున్నారు. నీటితో నిండిన గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, ఆటోలు, కార్లు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది.
పట్టించుకోవాలని విజ్ఞప్తి
ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక నిధులు కేటాయించి నాణ్యమైన సీసీ లేదా బీటీ రోడ్డు నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Next Story






