స్కూల్‌లో దారుణం.. విద్యార్థులను ఎండలో నిలబెట్టి, వీపుపై బరువులు వేసి..

by  |
స్కూల్‌లో దారుణం.. విద్యార్థులను ఎండలో నిలబెట్టి, వీపుపై బరువులు వేసి..
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రభుత్వ హై స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటేనే బయపడి వణికిపోతున్నారని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. పినపాక మండలంలోని ప్రభుత్వ హై స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారని ఉపాధ్యాయులు వారిని ఎండలో వంగోపెట్టి వాళ్లపై మూడు కేజీల రాళ్ల బరువును మోపారు. దీంతో విద్యార్థులు రాళ్ళ బరువు మోయలేక అవస్థలు పడుతున్నా.. ఉపాధ్యాయులు మాత్రం కనికరం లేకుండా కఠినంగా వ్యవహరించారు. తోటి విద్యార్థులను ఆ విద్యార్థులకు పక్కనే కాపలా ఉంచి రాళ్లు కింద పడితే మళ్లీ పెట్టే విధంగా చెప్పారు. దీంతో ఎండలో విద్యార్థులు రాళ్లు మోయలేక సొమ్మసిల్లిపోయారు.

ఈ క్రమంలో ఇంచార్జ్ హెచ్.ఎం ఎండలో విద్యార్థులను చూస్తూ ఫోన్‌లో ముచ్చటించడం గమనార్హం. ఈ సందర్భంలో అటుగా వెళ్లిన దిశ రిపోర్టర్.. ఈ విషయంపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా ఇద్దరు కొట్టుకున్నారని.. అందుకే ఇలా శిక్ష వేసినట్టు సమాధానం చెప్పడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలో ఇంత దారుణం జరుగుతున్నా జిల్లా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే మండల MEOని దిశ విలేకరి ఫోన్‌లో వివరణ కోరగా.. ఆయన అక్కడ లేరని, మణుగూరు ఉన్నట్టు చెప్పారు. విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు అలా చేయడం కరెక్ట్ కాదని.. ఈ ఘటనపై వివరణ కోరుతామని వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed